వైఎస్సార్సీపీ నుంచి మరో ఎమ్మెల్యే జంపింగ్?
వైఎస్సార్సీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే విషయమై తన అనుచరులతో అమర్ నాథ్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే.